Jobs : పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఏడాదికి 50 లక్షల జీతంతో ఉద్యోగం.. త్వరగా అప్లై చేయండి
పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఏడాదికి 50 లక్షల జీతంతో ఉద్యోగం.. త్వరగా అప్లై చేయండి
Jobs : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. భారీ జీతంతో కూడిన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని బ్రాంచుల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఎస్బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ వంటి కీలక పోస్టులు ఉండటం విశేషం.
ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 116 పోస్టులలో 12 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండగా, 104 డిప్యూటీ మేనేజర్ (IS ఆడిట్) పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కళ్లు చెదిరే స్థాయిలో వేతనం లభిస్తుంది. ముఖ్యంగా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ఏడాదికి సుమారు రూ. 50 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ జీతభత్యాలు, ఇతర అలవెన్సులు అందుతాయి. ఎస్బీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.
విద్యార్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో BE, B.Tech లేదా M.Sc ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యా అర్హతతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అనుభవం కూడా అవసరం. వయస్సు పరిమితి విషయానికి వస్తే, 31 జనవరి 2026 నాటికి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చాలా సింపుల్ గా ఉంది. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15, 2026. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750 ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.