JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!

JEE Main 2026 Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్‌)-2026 పేపర్‌-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

Update: 2026-02-16 13:16 GMT

JEE Main 2026 Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్‌)-2026 పేపర్‌-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ రోజు ఉదయం ఫైనల్ కీని ప్రకటించిన అధికారులు, కొద్దిసేపటి క్రితమే ఫలితాలను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచారు.

తెలుగు రాష్ట్రాల ప్రభంజనం:

ఈ ఏడాది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ అప్రతిహత విజయయాత్రను కొనసాగించారు. దేశస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలుగు వారు గట్టి పోటీనిచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక విద్యార్థి 100 పర్సంటైల్ స్కోరుతో అద్భుత ప్రతిభ కనబరిచారు.

స్కోర్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

NTA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

'JEE Main 2026 Session 1 Score Card' లింక్‌పై క్లిక్ చేయండి.

మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ (లేదా పుట్టిన తేదీ) మరియు స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

మీ స్కోర్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

Tags:    

Similar News