JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు వచ్చేసాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 5 నుంచి 8 వరకు పరీక్షలు రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు వచ్చేసాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
JEE Main 2026 Admit Card: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ (IIT), ఎన్‌ఐటీ (NIT)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 పరీక్షల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో పరీక్షలు రాయబోయే అభ్యర్థుల అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కింది వివరాల ద్వారా తమ అడ్మిట్ కార్డులను పొందవచ్చు:
అప్లికేషన్ నంబర్ (Application Number)
పాస్‌వర్డ్ / పుట్టిన తేదీ
సెక్యూరిటీ పిన్
ముఖ్యమైన సూచనలు:
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై క్యూఆర్ కోడ్ (QR Code), బార్ కోడ్ (Bar Code) స్పష్టంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఒకవేళ అవి సరిగ్గా ప్రింట్ కాకపోయినా లేదా బ్లర్‌గా ఉన్నా.. వెంటనే మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు:
ఈ ఏడాది సెషన్-2 పరీక్షలకు సుమారు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 2, 4, 5, 6, 7, 8.
షిఫ్టులు: ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది (ఉదయం 9 - 12; మధ్యాహ్నం 3 - 6).
పేపర్ 2 (B.Arch/B.Planning): ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించనున్నారు.
చివరి రోజు: ఏప్రిల్ 8న కేవలం రెండో షిఫ్టులో మాత్రమే పేపర్-1 పరీక్ష ఉంటుంది.
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే అభ్యర్థులు 011-40759000 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా jeemain@nta.nic.in మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.