AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్..?

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మార్చి 16వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Update: 2026-04-03 07:41 GMT

AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్..?

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మార్చి 16వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మూల్యాంకనం మరియు ఫలితాలపై నెలకొంది.

ఏప్రిల్ 6 నుంచి మూల్యాంకనం:

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (Spot Valuation) ఏప్రిల్ 6వ తేదీ నుండి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఏప్రిల్ 15 లేదా 16వ తేదీలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు దొర్లిన నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. డేటా అప్‌లోడ్ ప్రక్రియలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు.

పరీక్షల గణాంకాలు:

మొత్తం విద్యార్థులు: 6,22,152 (రెగ్యులర్), 19,000 పైగా (ప్రైవేటు).

పరీక్షా కేంద్రాలు: 3,415 సెంటర్లు.

హాజరు శాతం: 99 శాతానికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు:

గత ఏడాది ఏప్రిల్ 23న ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ, ఈ ఏడాది కూడా అదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తోంది. మూల్యాంకనం వేగంగా పూర్తి చేసి, ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ లో చూసుకోవచ్చు. అలాగే అభ్యర్థుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.

Tags:    

Similar News