HPCL Recruitment 2022: వారికి సువర్ణవకాశం.. HPCLలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..?
HPCL Recruitment 2022: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) ఇంజనీరింగ్ ఆఫీసర్లతో పాటు పలు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది
HPCL Recruitment 2022: వారికి సువర్ణవకాశం.. HPCLలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..?
HPCL Recruitment 2022: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) ఇంజనీరింగ్ ఆఫీసర్లతో పాటు పలు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.comలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 22 జూలై 2022 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 303 పోస్టులను భర్తీ చేస్తారు.
ఇందులో 103 మెకానికల్ ఇంజనీర్, 42 ఎలక్ట్రికల్, 25 సివిల్, 89 హెచ్‌ఆర్ ఆఫీసర్, 5 ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో చూడవచ్చు. ఈ పోస్టుల కోసం, BE, B.Tech, డిగ్రీ విద్యార్థులు పోటీ పడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంది. ఇంజినీరింగ్ పోస్టులకు సేఫ్టీ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, బ్లెండింగ్ ఆఫీసర్, సీఏకు 25, హెచ్‌ఆర్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్‌కు 27, లా ఆఫీసర్‌కు 26, మేనేజర్‌కు 34, సీనియర్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 37 ఏళ్లుగా నిర్ణయించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.1180. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఇందులో సడలింపు ఉంటుంది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడటానికి అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com సందర్శించండి.