BEL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్..!
BEL Recruitment 2022: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్‌అని చెప్పవచ్చు.
BEL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్..!
BEL Recruitment 2022: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్‌అని చెప్పవచ్చు. బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 21 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు. ఎంపికైన అభ్యర్థులకి మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000, నాలుగో ఏడాది నెలకు రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
బీటెక్/బీఈ లో కనీసం 55 శాతం మార్కుతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు, 472 రూపాయలుగా నిర్ణయించారు. చివరి తేది జూన్ 29 అని గుర్తుంచుకోండి.