పంజాగుట్ట ఆటో డ్రైవర్ హత్య కేసును గంటల్లో చేధించిన పోలీసులు

Update: 2019-10-21 05:39 GMT

కత్తి పట్టినోడు ఆ కత్తికే బలయ్యాడు. స్నేహితుడైన తోటి ఆటో డ్రైవర్‌ను చంపి చివరికి అతడి కుటుంబ సభ్యుల చేతిలో హతమైయ్యాడు. హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఈ దారుణ హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టారు.

హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఆటో డ్రైవర్ మర్టర్ కేసును అతి తక్కువ సమయంలోనే పోలీసులు చేధించారు. ఉదయం టీ తాగుదామని టీస్టాల్‌కు వెళ్లిన ఆటో డ్రైవర్‌ రియాసత్ అలీని పథకం ప్రకారం ప్రత్యర్థులు హత్య చేశారు.

మూడు నెలల క్రితం జరిగిన అన్వర్ అనే ఆటో డ్రైవర్ హత్య కేసులో అలీ ప్రధాన నిందితుడు. ఆ కేసులో అలీ చంచల్ గూడ జైలుకు వెళ్లి 9 రోజుల క్రితమే బెయిల్‌పై బయటికొచ్చాడు. దీంతో అలీని ఎలాగైన అంతమొందించాలని అన్వర్ సోదరుడు రహ్మన్, అన్వర్ కుమారుడు అజర్ స్కెచ్‌ వేశారు. మరికొందరు గ్రూప్‌గా ఏర్పడి రెక్కి నిర్వహించి మరి అలీని కత్తులతో నరికి చంపేశారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వారు ఉపయోగించిన కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పటి స్నేహితుల మధ్య ఆటో స్టాండ్‌ వద్ద జరిగిన చిన్న గొడవ ఈ హత్యలకు కారణమని పోలీసులు తేల్చారు. 

Tags:    

Similar News