Murder: నిద్రలోనే రోకలితో దాడి.. ఆపై సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిన భర్త
Murder:హైదరాబాద్ బోరబండలో భార్యపై అనుమానంతో భర్త రోకలిబండతో దారుణంగా హత్య చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Murder: నిద్రలోనే రోకలితో దాడి.. ఆపై సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిన భర్త
Murder: హైదరాబాద్ బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త తలపై రోకలిబండతో బలంగా మోది ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సరస్వతి(34)లకు 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా రాజీవ్‌గాంధీ నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు తరచూ గొడవలకు దిగేవాడని సమాచారం.
సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన సరస్వతి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో, ఆంజనేయులు రోకలిబండతో ఆమె తలపై పలుమార్లు మోది హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.