Tamil Nadu Tragedy: విద్యుత్తుశాఖ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య.. వీడియోలో షాకింగ్ విషయం

Tamil Nadu Tragedy: తమ మృతదేహాలను సహోద్యోగులే పాతిపెట్టాలంటూ కోరిన విద్యుత్తుశాఖ ఇంజినీర్ కుటుంబం కోయంబత్తూరులో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2026-02-03 08:33 GMT

Tamil Nadu Tragedy: విద్యుత్తుశాఖ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య.. వీడియోలో షాకింగ్ విషయం

Tamil Nadu Tragedy: తమ మృతదేహాలను సహోద్యోగులే ఖననం చేయాలంటూ కోరిన ఓ విద్యుత్తుశాఖ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కోయంబత్తూరు జిల్లా పెరియనాయక్కన్‌పాళైయానికి చెందిన కమలేశ్‌, ఆయన భార్య ఇలక్కియా, కుమార్తె యక్షిత ఏంజెల్ మృతదేహాలు సోమవారం ఉదయం వారి నివాసంలో లభ్యమయ్యాయి.

కమలేశ్‌ (48) స్థానిక విద్యుత్తు ఉపకేంద్రంలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య ఇలక్కియా నర్సుగా పనిచేశారు. వారి కుమార్తె యక్షిత ఏంజెల్ (10) ఐదో తరగతి చదువుతోంది. ఇంట్లో ముగ్గురు మృతి చెందినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

విచారణలో భాగంగా కమలేశ్‌ సెల్‌ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు, అందులో ఓ వీడియో రికార్డింగ్‌ను గుర్తించారు. ఆ వీడియోలో ఇలక్కియా గత రెండేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగా కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనై, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా, తమ మృతదేహాలను స్థానిక సీఎస్‌ఐ చర్చి ప్రాంగణంలో ఖననం చేయాలని, కమలేశ్‌ పొదుపు చేసిన డబ్బును సీఎస్‌ఐ చర్చికి విరాళంగా ఇవ్వాలని వీడియోలో కోరినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, తమ మృతదేహాలను తనతో కలిసి పనిచేసే సహోద్యోగులే పాతిపెట్టాలని కూడా వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News