హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య

Update: 2019-12-13 08:08 GMT

హైదరాబాద్ బంజారాహిల్స్ లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సయ్యద్ నగర్ కు చెందిన సయ్యద్ బామ్ బైక్‌పై వెళ్తుండగా ఎన్.బీటీ నగర్ ఆటో స్టాండ్ దగ్గర నలుగురు యువకులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ముఖం, మెడ, ఛాతిపై తీవ్రంగా పొడిచారు. హత్య సమయంలో నిందితుల చేతిలోని ఒక కత్తి విరిగి పోయింది. హత్య చేసిన నలుగురు యువకులు నేరుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఘటనా స్థలంలో రెండు కత్తులు, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Tags:    

Similar News