'దిశ'పై పోస్టులు.. మరొకరి అరెస్టు

Update: 2019-12-05 07:11 GMT
అంబాల అనీల్‌

దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఓవైపు ఆమెపై జరిగిన దారుణంపై మండిపడుతుంటే కొందరు మాత్రం సోషల్‌ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు. దిశ హత్య కేసులో నిందితులకు సపోర్ట్‌గా అసభ్యకరంగా ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేసిన నల్గొండ జిల్లా గుండ్రంపల్లికి చెందిన అంబాల అనీల్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదే కేసులో నిన్న గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ అలియాస్ నానిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేశాడు. ఫేస్ బుక్‌లో గ్రూప్‌గా ఏర్పడి దిశపై అసభ్య కామెంట్లు చేసిన వారిలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. మరికొంతమందిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. 

Tags:    

Similar News