వివాహం కాలేదని యువతి ఆత్మహత్య

Update: 2018-08-17 11:05 GMT

వివాహం కావడం లేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక బాగల్‌కోట పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. హళేపెటలో నివాసముండే  రాహీలా మనియార (28) నర్శింగ్ విద్యను అభ్యసించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్ విభాగంలో పనిచేస్తోంది. అయితే కొన్ని సంవత్సరాలుగా కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ కుదరడంలేదు. పైగా ఆమె స్నేహితురాళ్లకు అందరికి వివాహాలు జరిగిపోయాయన్న బాధ ఆమెలో గూడుకట్టుకుంది. దీంతో  బుధవారం సాయంత్రం పని ముగించుకుని రాహీలా ఇంటికి రాకుండా పట్టణ శివారులో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లి చెప్పులు, బ్యాగు కుంట గట్టుమీద వదిలేసి నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి అవుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కూతురు ఇంకా వచ్చిందా అని ఆసుపత్రికి ఫోన్ చేసి వాకబు చేశారు. వారు సాయంత్రమే వచ్చిందని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నీటికుంటలో శవం తేలుతుండడం చూసిన స్థానికులు పోలీసులకు అందించారు. పక్కనే ఉన్న బ్యాగు పరిశీలించగా సూసైడ్ లెటర్ దొరికింది. అందులో 'అప్ప, అమ్మ నన్ను క్షమించండి. నా చావుకి ఎవరూ కారణం కాదు.. మీ ముద్దుల కూతురు' అని రాసి వుంది. కాగా ఆమె హళేపెటకు చెందిన యువతిగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా తల్లిదండ్రులు మనియార ను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. 

Similar News