యువతిపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అత్యాచారం

Update: 2018-07-15 03:24 GMT

యువతిపై బీఎస్‌ఎఫ్‌ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌‌లో చోటుచేసుకుంది. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. లైంగికదాడికి పాల్పాడి వీడియో తీసి పెళ్లి ప్రస్తావన తెస్తే ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించేవాడని.. జవాను వేధింపుల్ని తట్టుకోలేక తన కూతురు ప్రాణాలు తీసుకుందని ఫిర్యాదులో పేర్కోన్నాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News