టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ఆ అగ్రనటుడు ఇకలేరు!

Update: 2018-05-27 03:07 GMT

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నటులు కొందరు తమ అభిమానులకు తీవ్ర విషాదాన్నినింపుతున్నారు రెండు నెలల కిందట అమృతం హనుమంతరావు మృతిచెందిన సంగతి మరువక ముందే.. అలనాటి దర్శకుడు, అగ్రనటుడు , నిర్మాత మాదాల రంగారావు (69) హఠాన్మరణం చెందారు. గత కొంత కాలంగా గుండె సంబంధితవ్యాధితో బాధపడుతున్న మాదాల నేడు తుదిశ్వాస విడిచారు.  వామపక్ష బావజాలమున్న రంగారావు సమాజంలో జరుగుతున్న అకృత్యాల గురించి వేలెత్తి చూపుతూనే అభ్యుదయ చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించారు..  కాగా మాదాల కేవలం నటించడమే కాకుండా తనదైన శైలిలో చిత్రాలు కూడా నిర్మించారు. మాదాల నిర్మించిన చిత్రం  'యువతరం కదిలింది' ఈ చిత్రానికిగాను నంది అవార్డుకు ఎంపికయ్యారు. ఆ తరువాత ఎర్ర మల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, నవోదయం, విప్లవశంఖం, బలిపీఠంపై భారతనారి, తొలిపొద్దు, ఎర్ర సూర్యుడు, జనం మనం, ప్రజాశక్తి, స్వరాజ్యం వంటి ప్రఖ్యాత చిత్రాల్లో  నటించారు. టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి దాసరినారాయణరావు శిష్యుడిగా  మాదాల సినిమా ప్రస్థానం మొదలైంది. ఇక ఆయన మృతిపట్ల  పలువురు సినిమా ప్రముఖులు షాక్ లో మునిగిపోయారు. ఈ క్షణం నుంచి మాదాల రంగారావు ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకున్నారు. అయన మృతిపట్ల సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 

Similar News