ఒకటో తరగతి విద్యార్ధిపై ఆరో తరగతి విద్యార్ధి దాడి

Update: 2018-01-19 07:28 GMT

చిన్న పిల్లల్లో నేర ప్రవృత్తి రాను రాను పెరిగిపోతోంది.. స్కూలు శెలవు కోసం.. తోటి విద్యార్ధులను హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదు. గతంలో ఢిల్లీలో జరిగిన హత్య తరహాలోనే యూపీలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పిల్లలపై చదువుల ఒత్తిడి ఏ మేరకు ఉందనడానికి ఈ సంఘటనలే ఒక ఉదాహరణ. చిన్న పిల్లల్లో నేర ప్రవృత్తి వెర్రి తలలు వేస్తోంది. యూపీలో ఓ ఎల్ కేజీ స్టూడెంట్ ను సీనియర్ కత్తితో పొడిచి హత్యా యత్నం చేయడం కలకలం రేపింది. గురుగావ్ లో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఘటన దర్యాప్తు ముగియకుండానే తాజాగా మరో సంఘటన తల్లి దండ్రుల్లో భయాన్ని పెంచుతోంది.

బ్రైట్ లాండ్ స్కూలులో ఆరో తరగతి చదువుతున్న ఒక బాలిక ఆరేళ్ల వయసున్న ఒకటో తరగతి విద్యార్ధి రితిక్ ను టాయిలెట్ కు తీసుకు వెళ్లి కిచెన్ నైఫ్ తో దాడి చేసింది. స్కూలుకు శెలవు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ బాలుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. సంఘటనను ఒక రోజు పాటూ బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచిన స్కూల్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.. అయితే ఘటన జరిగిన స్థలంలో సిసిటివిలు లేనందున హత్యాయత్నం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా సందేహాలున్నాయి. గాయపడిన బాలుడి ఒంటి పై నిందితురాలికి సంబంధించిన జుట్టు దొరకడంతో దానిని డిఎన్ ఏ పరీక్షలకు పంపుతున్నారు. బాధిత బాలుడి పొట్టపైనా, ఛాతీపైనా బలమైన గాయాలున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. సంఘటన పై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో తల్లి దండ్రులు వారి పిల్లల భద్రత గురించి భయపడుతున్నారు. గతేడాది.. ఢిల్లీలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో16ఏళ్ల స్టూడెంట్.. పరీక్షలు, పేరెంట్, టీచర్ మీటింగ్ వాయిదా కోసం ప్రద్యుమ్న అనే రెండో తరగతి స్టూడెంట్ ను చాకుతో గొంతుకోసి చంపేశాడు.. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

Similar News