రూ. 50లో 37 రూపాయలు దోచేస్తున్నారు : మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్

Update: 2018-09-03 10:56 GMT

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమర్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క లిక్కర్ మీదనే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని అన్నారు. రూ.8.50కి తయారయ్యే మద్యం.. ఖర్చులు, కమిషన్ అన్ని కలిపి 13 రూపాయలు అయితే దానిని ఆంధ్రప్రదేశ్ లో 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇందులో 37 రూపాయలు ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. అలాగే అమరావతి బాండ్ల విషయంపై మాట్లాడిన ఉండవల్లి 2వేల 
 కోట్లు అప్పుతేవడానికి బ్రోకర్ కె 17కోట్లు ఇచ్చారు. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక వడ్డీకి  అప్పుచేసి గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. రోజు రోజుకు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆంధ్రప్రదేశ్ లో రెండు రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారన్నారు. నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారదర్శకత గురించి మాట్లాడతారు.. వాస్తవాలు ప్రజలతో పంచుకోవడమే పారదర్శకత అని అన్నారు. నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Similar News