మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వీయా గృహనిర్బంధం

Update: 2018-09-11 06:20 GMT

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలనేదని మనస్థాపంతో.. మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వయంగా గృహనిర్బంధం వెళ్లారు. ఇంట్లో తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఓదెలుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు. 24 గంటల్లో టికెట్‌పై హామీ రాకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా ఓదెలు చెప్పారు. కేసీఆర్ ను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టికెట్ ఎందుకు ఇవ్వరని ఓదెలు ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశాననీ, అలాంటి తనను పక్కకు తప్పించడం దారుణమని ఓదేలు వాపోయారు. తనకేదయినా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యతని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల కేసీఆర్ 105 అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలిజాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది ఆశావహుల పేర్లు గల్లంతయ్యాయి. చెన్నూరు టికెట్ ను టీఆర్ఎస్ అధినేత ఈసారి ఎంపీ బాల్క సుమన్ కు కట్టబెట్టారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ఓదేలు రగిలిపోతున్నారు.

Similar News