తొక్కారు.. గిల్లారు

Update: 2018-03-12 12:15 GMT

తొక్కారు.. కొట్టారు.. గిల్లారు.. అణచివేశారు.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. మార్షల్స్ పై చేస్తున్న ఆరోపణలు. అందుకే అసెంబ్లీలో తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే మార్షల్స్ తమపైకి దాడికి దిగారంటూ.. ఆరోపించారు. 

తెలంగాణ బడ్జెట్  సమావేశాల తొలిరోజునే అసెంబ్లీలో భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే హెచ్చరించినట్లు కాంగ్రెస్ నాయకులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం చెప్పినట్లే అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు రచ్చ రచ్చ చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేయడమే కాకుండా వేదికపైకి హెడ్ ఫోన్స్ ను విసేరేశారు. ఈ క్రమంలో అది మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. 

అయితే ఈ అనూహ్య పరిణామంపై కాంగ్రెస్ వివరణిస్తూ తప్పంతా తమది కాదనే ప్రయత్నం చేసింది. తమను అడ్డుకున్న మార్షల్స్, వారికి డైరెక్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని వారివైపే వేలు చూపించే ప్రయత్నం చేసింది. ప్రజాస్వామ్య పద్దతిలో తాము నిరసన తెలుపుతుంటే ఏకంగా 50 మంది మార్షల్స్ తమపైకి వచ్చారని తొక్కడం, గిల్లటం, కొట్టడం వంటి పనులు చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై సీఎం కేసీఆర్ నే టార్గెట్  చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఉంటే.. ప్రజాస్వామ్యం మనుగడ సాగదని హెచ్చరిస్తోంది. 

Similar News