తెలంగాణ వెదర్ యాప్.. రాబోయే 3 రోజులు..

Update: 2018-06-30 03:28 GMT

తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాతావరణాన్ని తెలుసుకునేందుకు TS వెదర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ సహకారంతో తెలంగాణ ప్రణాళికాభివృద్ధి సంస్థ ఈ యాప్ ను రూపొందించింది. వాతావరణ యాప్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాతావరణ వివరాలు తెలుసుకునేలా యాప్‌ను రూపొందించామన్నారు.ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పని చేస్తుంది. రాబోయే 3 రోజుల వాతావరణ సమాచారం సైతం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి TS వెదర్ యాప్ అని టైప్ చేసి ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

Similar News