మందుబాబులకు ఇయర్‌ ఎండ్‌ షాక్

Update: 2017-12-27 05:16 GMT

మందుబాబులకు తెలంగాణ సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది న్యూఇయర్ వేల మద్యం ధరలు పెంచుతూ మందు కొట్టకుండానే కిక్కు వదిలించింది..మందు బాబుల దిమ్మ తిరిగేలా ఒక్క బీరు తప్ప మిగిలిన మద్యం రేట్లు పెంచేసింది గత అక్టోబర్‌లో టెండర్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు రేట్లు పెంచారు పెంచిన రేట్లు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. IMFL కార్టన్ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 12 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ధర 450 నుండి 700 ఉన్న కార్టన్‌కు 12 శాతం,  700 నుండి 1,000 ఉన్న మద్యానికి 10 శాతం, 1,000 ఆపైన ఉన్న లిక్కర్‌కు 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

దీని ప్రకారం క్వార్టర్‌కు కనిష్టంగా  6 రూపాయలు ప్రీమియం లిక్కర్  క్వార్టర్ కు 70 రూపాయలకు పైగా ధరలు పెరిగాయి పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది అయితే బీరు ప్రియులకు మాత్రం సర్కారు చల్లని వార్త చెప్పింది బీరు ధరలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 12 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెరగటం ఇదే ప్రథమం. 

Similar News