ఏపీ అసెంబ్లీ వద్ద ఎస్సైకి గుండెపోటు

Update: 2018-09-11 11:03 GMT

ఏపీ అసెంబ్లీ వద్ద విధులు నిర్వర్తించానికి వచ్చిన ఓ ఎస్సి  గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై కోలా మోహన్‌ నేడు గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో  అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. 

Similar News