ఒక్క అత్యాచారం ఖ‌రీదు ఆరువేలా : సుప్రీం

Update: 2018-02-15 22:45 GMT

నిర్భ‌య ఘ‌ట‌న త‌రువాత మ‌హిళ‌ల‌పై ఎలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.  దీంతో పాటు అత్యాచారానికి గురైన బాధితుల‌కు ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్భ‌య మూల‌ధ‌న ప‌థ‌కం కింద న‌గదును అంద‌జేస్తుంది. అయితే ఆ న‌గ‌దు స‌రిగ్గా చేర‌డంలేద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల‌పై  సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. 
జ‌న‌వ‌రిలో లైంగిక దాడులకు గురైన బాధితుల‌కు అండ‌గా నిర్భ‌యం ప‌థ‌కం కింద ల‌బ్ధ చేకూరుతుందా..? లేదా..? ఎంత‌మంది బాధితులు ఉన్నారు. అనే అంశంపై పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని  24 రాష్ట్రాలు, కేంద్ర‌ప్రాంతాల‌కు  సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  
అయితే ఈ పిటిష‌న్ పై హ‌ర్యానా ప్ర‌భుత్వం స్పందించింది. త్వ‌ర‌లో తాము అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తామ‌ని సూచించింది.  ఇంకా అఫిడవిట్ దా ఖలు చేయని రాష్ర్టాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం అఫిడవిట్ సమర్పించేందుకు మీ ఇష్టమున్నంత సమయం తీసుకోండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోలేమని మీమీ రాష్ర్టాల్లోని మహిళలకు చెప్పండి అని ధర్మాసనం ఆగ్రహించింది.
 సిక్కిం , మేఘాలయ సుప్రీంకోర్టుకు విన్నవించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా నాలుగు  నెల‌ల్లో అఫిడ‌విట్ ను దాఖ‌లు చేయాల‌ని సూచించింది. 
అయితే అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పై సుప్రీం మండిప‌డింది.  మధ్యప్రదేశ్‌లో 1,951 మంది బాధితులున్నారు. వారికి మీరు రూ.6 వేల నుంచి రూ.6,500 ఇస్తున్నారని పేర్కొంది. ఈ ఆర్ధిక సాయం పై   జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడా ధర్మాసనం ప్రశ్నించింది.  ఒక లైంగికదాడి ఖరీదు రూ.6 వేలా? ఇంత స్వల్పమొత్తం అందజేసి అత్యాచార బాధితులపై ప్రభుత్వం దయచూపుతున్నదా? అని మధ్యప్రదేశ్ ప్ర‌భుత్వం పై మండిప‌డింది. ఒక లైంగికదాడి ఖరీదు రూ.6 వేలా? ఇంత స్వల్పమొత్తం అందజేసి అత్యాచార బాధితులపై ప్రభుత్వం దయచూపుతున్నదా? అని మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం విడుదల చేసిన నిర్భయ నిధుల నుంచి పెద్ద మొత్తంలో మధ్యప్రదేశ్‌కు అందినా బాధితులకు తక్కువ మొ త్తం అందించడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 

Similar News