బీహార్లో ఓ మైనర్ బాలిక పట్ల ఏడుగురు దుండగులు అత్యాచార యత్నం చేశారు. ఆ దుర్మార్గపు చర్యను వారి వీడియోలో చిత్రీకరించారు. సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు తక్షణమే రంగంలో దిగారు. ఏడుగురిలో ఇద్దరిని అపుదులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ సంఘటన బీహార్లో కైముర్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.