వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు

Update: 2018-09-07 12:42 GMT

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆంధ్రలోని ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పైగా రానున్న నాలుగైదు రోజులు సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలిపింది. అలాగే రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులుకురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కాగా ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ సహా కర్ణాటకలో భారీ వర్షాలు పడ్డాయి. దాంతో కేరళ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతం నౌరుతిరుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

Similar News