యూట్యూబ్ తెచ్చిన తంటా.. ప్రాణభయంతో జనం పరుగులు

Update: 2018-06-04 03:59 GMT

యూట్యూబ్ లో చూసి ఓ వ్యక్తి నాటుతుపాకీ తయారు చేశాడు.  పేలుతుందో  లేదో అని టెస్ట్ చేసి అనూహ్యంగా పోలీసులకు దొరికాడు. ఈ ఘటన తుప్రాన్‌ గ్రామంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కోడూర్‌ గ్రామానికి చెందిన మరదన రమేశ్‌ (26) నగరంలోని ఓ స్టీల్‌ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ చూసేవాడు. ఈ క్రమంలో తుపాకీ  తయారు చేయడం ఎలాగో చూసి నాటు తుపాకీ  తయారు చేశాడు. ఇది పేలుతుందో లేదో అని తుప్రాన్‌ గ్రామపంచాయితీ వెనుకాల ఉన్న కల్లు దుకాణంలోకి వెళ్లి ఓ తూటాను పేల్చాడు. సడన్ గా పెద్ద శబ్దం రావడంతో  జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు.ఇంతలో  ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న ఎస్సై.. రమేశ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News