తగ్గుముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు

Update: 2018-11-08 03:46 GMT

గతకొంత కాలంగా పడి లేస్తూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(గురువారం) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా దిగి వస్తున్న తరుణంలో దేశీయంగా కూడా పెట్రోలు , డీజిల్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. లీటరు పెట్రోలుపై సగటున 21పైసలు, డీజిల్‌ పై 18పైసలు మేర ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో : లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ. 78.21కు ఉంటే, డీజిల్ ధర లీటరు రూ. 72.89 ఉంది. అలాగే కోలకతాలో: లీటర్ పెట్రోల్ రూ. 80.13, డీజిల్ ధర రూ.74.75 ఉంది. ఇక ముంబైలో : లీటర్ పెట్రోల్ ధర రూ.83.72, డీజిల్ ధర రూ.76.38గా ఉంది. చెన్నైలో : లీటర్ పెట్రోల్ రూ. 81.24, డీజిల్ ధర రూ.77.05 కు చేరింది. ఇక ఆంధ్ర తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్‌: లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 93, డీజిల్ 22 పైసలు తగ్గి లీటరు రూ. 79.31 కు చేరింది. విజయవాడలో: లీటర్ పెట్రోల్ 82.11, డీజిల్ ధర రూ. 78.08

Similar News