ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఇకలేరు!

Update: 2018-05-21 05:03 GMT

ప్రఖ్యాత తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి(79) ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలోనే ఆమె కన్నుమూశారు. దశాబ్దానికిపైగా అమెరికాలోని తన కూతురు వద్ద ఉంటోంది సులోచనారాణి ఈ క్రమంలో ఆదివారం హఠాన్మరణం చెందారు. ఆమె మృతికి పలువురు రచయితలు నివాళులు అర్పించారు. కాగా ఆమె మృతిని ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ అధినేత ఎమెస్కో  విజయ్‌ కుమార్‌ దృవీకరించారు. సింహభాగం సులోచనారాణి రచనలు ఎమెస్కో లోనే ప్రచురించినట్టు ఈ సందర్బంగా తెలిపారు. ఆమె అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించనునంట్టు సులోచనారాణి కూతురు వెల్లడించింది. 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది సులోచనారాణి. ఆమె రాసిన నవలలు ముఖ్యంగా.. ఆగమనం , అమృతధార , ఋతువులు నవ్వాయి , కలలకౌగిలి వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి.. జీవన తరంగాలు ,సెక్రటరీ ,రాధాకృష్ణ , అగ్నిపూలు ,చండీప్రియ వంటి నవలను ఆధారంగా చేసుకొని సినిమాలు నిర్మించారు. అంతేకాకుండా టెలివిజన్ రంగంలోసూపర్ హిట్ అయినా రాధా మధు సీరియల్ ఆమె రచించిన నవలే కావడం విశేషం. 

Similar News