జగన్ అన్నా.. జన్మదిన శుభాకాంక్షలు: టీఆర్‌ఎస్ ఎంపీ కవిత

Update: 2018-12-21 09:31 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా  వైఎస్ జగన్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జగన్ అన్న.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అని కవిత ట్వీట్ చేశారు. జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపమని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌పై జగన్ స్పందించారు. ‘థ్యాంక్యూ ఫర్ యువర్ వామ్ విషెస్’ అని జగన్ రీట్వీట్ చేశారు.

Similar News