మళ్లీ పెరిగిన సిలిండర్‌ ధర

Update: 2018-11-10 03:25 GMT

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు వినియోగదారులు. ఈ క్రమంలో వంటగ్యాస్ ధర సైతం మండుతోంది. సిలిండర్‌ ధర ఈ నెలలో  కేవలం 9 రోజుల వ్యవధిలోనే రెండవసారి పెరిగింది. ఎల్‌పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు తెలిపారు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్‌ ధర రూ. 507.42కు చేరింది. ప్రస్తుతం వంటగ్యాస్‌ డీలర్లకు 14.2కేజీల సిలిండర్‌కు రూ.48.89 ఇస్తుండగా..  5కేజీల సిలిండర్‌కు రూ. 24.20 చొప్పున కమిషన్‌ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది చమురు మంత్రిత్వ శాఖ. దాంతో 14.2కేజీల సిలిండర్‌కు రూ. 50.58,  5 కేజీల సిలిండర్‌కు రూ. 25.29 చొప్పున కమిషన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇంధన సరఫరాదారులు అంటున్నారు.

Similar News