చంచల్ గూడ జైలుకు జగ్గారెడ్డి తరలింపు!

Update: 2018-09-11 09:31 GMT

2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 25 వరకు జగ్గారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టు పొందిన కేసులో పోలీసులు నిన్న ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 420, 467, 468, 471, 370 సెక్షన్లతో పాటు పాస్‌పోర్టు చట్టం 1967 సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశారు.

Similar News