ఓటు హక్కు ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Update: 2018-10-02 11:15 GMT

కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం కల్పిస్తుంది భారత ఎన్నికల వ్యవస్థలోని ఆర్టికల్‌ 326. నిర్దేశిత వయసు దాటిన ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం కోసం ఈ అవకాశం కల్పిస్తోంది. అయితే ఓటు లేని ప్రతి ఒకరికి ఒకటే ఆసక్తి.. ఓటు హక్కు ఎలా సాధించుకోవాలా? అని. ఓటు హక్కు నమోదు చేసుకోవడం కోసం రెండు పద్దతులున్నాయి. మొదటిది సంబంధిత అధికారులు వచ్చినప్పుడు అప్లై చేసుకోవడం, రెండోది.. ఆన్ లైన్ ద్వారా. అయితే మొదటి పద్ధతి ప్రతి ఒకరికి కుదరవచ్చు, కుదరకపోవచ్చు. రెండో పద్ధతి ఆన్ లైన్ ద్వారా.. ఇలా చేయాల్సి ఉంటుంది. 

ముందుగా –> eg. http://ceoandhra.nic.in/ సైట్ ను ఓపెన్ చెయ్యాలి.

* సైట్ ఓపెన్ చేసిన తరువాత ఈ రిజిస్ట్రేషన్ ను క్లిక్ చేస్తే మీకు దరఖాస్తు పత్రాలు 6, 7, 8, 8ఏలు కనిపిస్తాయి. ఆరో నెంబర్ పత్రం కొత్త ఓటర్ల నమోదుకు కనుక దాన్ని నింపాల్సి ఉంటుంది. ఇందులో నమోదు కానున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోటో, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ సహా అడిగిన వివరాలు మొత్తం నింపాలి.

*ఆ తరువాత వివరాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని Submit బటన్ క్లిక్ చేయాలి.. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తో కూడిన అప్లికేషన్ నెంబర్ మొబైల్ కి సందేశం వస్తుంది.

*ఆ నెంబర్ తీసుకుని మీరు మీ దగ్గర్లోని Election Registration Officer దగ్గరికెళ్లి మీ ఫ్రూప్స్ ని చూపించాలి. దాంతోపాటు మీకు వచ్చిన అప్లికేషన్ నంబర్ ను చూపించాలి. వారు సరిచూసుకున్న తరువాత.. కొద్ది రోజులకు ధరఖాస్తును తీసుకుని వివరాలు కనుక్కోవడానికి మీ ఇంటికి వస్తారు. అప్పుడు సదరు ఆఫీసర్ కు మీ వివరాలు చెప్పాలి. ఆ తరువాత ఆ రిపోర్టును Election Registration Officerకు తిరిగి పంపిస్తారు.

*వెరిఫికేషన్ పూర్తయిన తరువాత గుర్తింపుకార్డు జారీ చేస్తారు. ఇది కొన్ని రోజుల తరువాత పోస్ట్ ద్వారా మీ చిరునామాకు వస్తుంది. ఈలోపే మీ అప్లికేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. 

* మీరు అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవడం కోసం అధికారిక వెబ్సైటు లో ఉన్న –> E-Registration –> Assembly constituency –> Know Your Status ను క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ వివరాలు వస్తాయి. ఇలా మీరు ఆన్ లైన్ లోనే ఓటరు గుర్తింపు కార్డుకు నమోదు చేసుకోవచ్చు. 

Similar News