ఆ గ‌డియారం నిర్మాణం ఖ‌రీదు 272 కోట్ల 20 లక్షలు

Update: 2018-02-22 07:37 GMT

నవ నగారికత వయసు పది వేల ఏళ్లేనట. ఏ నాగిరకతకైనా ఇంతకంటే ఎక్కువ వయస్సు ఉండదంటున్నారు అమెజాన్‌ వ్యవస్థాపకుడు. దీనికి సూచికగా అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌ పర్వతాల్లో పది వేల ఏళ్ల వరకు మాత్రమే పనిచేసే భారీ గడియారాన్ని ఏర్పాటు చేస్తున్నట్ట కూడా ప్రకటించాడు. ఇంతకీ ఏంటి గడియారం కథ? నగరికతకు, వయస్సుకు సంబంధం ఏంటి?

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బిజోస్‌ చేసిన సంచలన ప్రకటన ఇది. అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌ పర్వతాల్లో పది వేల ఏళ్ల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని రూపొందిస్తున్నారాయన. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్‌ ఆధారంగా శక్తి వస్తుంది.

ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామన్న బిజోస్‌ టెక్సాస్‌ కొండల్లో గడియారాన్ని అమర్చే ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. అమెరికాకు చెందిన డ్యాని హిల్లీస్‌ 1989లో భారీ గడియారాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. జెఫ్‌ బిజోస్‌ చేరికతో భారీ గడియారం ప్రాజెక్టు వాస్తవంలోకి వచ్చింది. 272 కోట్ల 20 లక్షల రూపాయలతో భారీ గడయారం కనువిందు చేయనుంది. 

భారీ గడియారంలో ఉన్న ప్రత్యేకతలేంటి? సూర్యకాంతి సాయంతో సమయం సరిచూసుకునే ఏర్పాటులో ఉన్న వెసలుబాటు ఏంటి? నాలుగంకెల రూపంతో కనిపించే సాధారణ గడియారానికి... ఐదంకెల రూపంతో ఉండే భారీ క్లాక్‌ మధ్య ఉన్న తేడా ఏంటి.?

భారీ గడియారంలో ఎన్నో ప్రత్యేకతలు... అత్యంత కచ్చితత్వంతో లెక్కించే ఏర్పాట్లు...సూర్యకాంతి సాయంతో సమయం సరిచూసుకునే వీలు... గ్రెగొరియన్‌ పద్ధతికి భారీ గడియారంతో అంకురార్పణ

టెక్సాస్‌ కొండల్లో నిర్మిస్తున్న ఈ భారీ గడియారంలో సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యకాంతి సాయంతో ఈ గడియారం తన సమయాన్ని సరిచేసుకుంటుంది. ఈ గడియారం సమయాన్ని గ్రెగొరియన్‌ పద్ధతిలో, ఐదు అంకెల రూపంలో తెలుపుతుంది. ఉదాహరణకు 2018ని ఈ గడియారం 02018గా సూచిస్తుందన్నమాట.

ఇందులోని ఓ ముల్లు ఏడాదికోసారి మాత్రమే కదిలితే.. మరో ముల్లు ప్రతి వందేళ్లకోసారి మాత్రమే ముందుకెళ్తుంది. ప్రతి వెయ్యేళ్లకోసారి సారి కూకూ అంటే ఓ పక్షిలాంటి నిర్మాణం బయటికొచ్చేలా ఈ గడియారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి 20 వేల ఏళ్లలో ఒకరోజు మాత్రమే తేడా వస్తుంది. ఈ భారీ గడియారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే 10,000 సంవత్సరాల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఈ గడియారంలో గంట మోగుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలు 10,000 ఏళ్లలోపే అంతమైందన్న కారణాలతో ఈ గడియారంలో జీవితకాలాన్ని 10 వేల ఏళ్లుగా నిర్ణయించారు. టెక్సాస్‌లోని ఈ భారీ గడియారం దగ్గరకు చేరుకోవాలంటే మాత్రం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సమీపంలోని విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే కొన్ని గంటల పాటు కారులో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక దాదాపు రెండు వేల అడుగులు కొండపైకి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. చివరికి భారీ స్టీల్‌ తలుపులు దాటుకుని వెళ్తే ఈ భారీ గడియారాన్ని చూడొచ్చు.

Similar News