బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన హార్దిక్ పటేల్..!

Update: 2017-12-17 08:53 GMT

గుజరాత్ ఎన్నికలు ముగిసాయి.. ఇక ఫలితాలే తరువాయి అన్న సమయంలో గుజరాత్ పటేళ్ల ఉద్యమ పోరాటసమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికలపై సంచలన ఆరోపణలు చేసారు.. బీజేపీ ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగుకు పాల్పడిందని ఆరోపించారు.. దాదాపు 17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటే కేవలం ఈవీఎంల టాంపరింగ్ ద్వారానే అని తేల్చి చెప్పారు.. అసలు గుజరాత్ ఎన్నికలకు సంబంధించి హార్దిక్ ఏమన్నారో చూడండి..

‘గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారానే గుజరాత్‌ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్‌ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది.

ఈవీఎం రిగ్గింగ్‌కు పాల్పడకపోతే బీజేపీ గుజరాత్‌లో 82 సీట్లకు మించి గెలువదు. బీజేపీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అలా కాకుండా బీజేపీ గెలిచిందంటే అది ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే..’ అని హార్థిక్‌ పటేల్ అన్నారు.. కాగా హార్దిక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో గుజరాత్ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి..   

Similar News