ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Update: 2018-03-05 04:16 GMT

 ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. 29వ తేదీ వరకూ మొత్తం 18 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. బీఏసీ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటారు. 8వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి కూడా సమావేశాలకు హాజరుకాకూడదని వైకాపా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించేందుకు గాను మొత్తం 29 అంశాల్ని తెదేపా శాసనసభాపక్షం ఎంపిక చేసింది.

Similar News