వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. దీని ప్రభావంతో..

Update: 2018-08-28 02:34 GMT

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.  అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నేడు రేపు ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇక విజయవాడలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిటీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లన్నీ నీటమునిగాయి. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వారితో పాటు.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Similar News