అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వాన...మరో 48గంటల్లో...

Update: 2018-06-23 03:05 GMT

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సహా పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం భానుడు ప్రతాపం చూపించాడు. చిరు జల్లులుగా ప్రారంభమైన వర్షం.. అర్ధరాత్రి సమాయానికి బీభత్సం సృష్టించింది.దీంతో హైదరాబాద్ లోని మాదాపూర్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, మారెడ్‌పల్లి, అడ్డగుట్ట, బోయిన్‌పల్లి, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, అబిడ్స్‌, లక్డీకాపూల్‌, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నాచారం, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అటు వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు చురుకుగా మారాయని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 

Similar News