అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్

Update: 2018-10-08 08:16 GMT

తెలంగాణ అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసన సభ రద్దు తీరు రాజ్యాంగ విరుద్ధమని ఆమె పిటిషన్‌లో తెలిపారు. శాసస సభను సమావేశపరచకుండా మంత్రి మండలి మాత్రమే రద్దు నిర్ణయం ఎలా తీసుకుంటుందని డీకే అరుణ ప్రశ్నించారు. అలాగే 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం ఎమ్మెల్యేల హక్కులను కాలరాయడమేనని డీకే అరుణ వాదిస్తున్నారు. ప్రస్తుతం డీకే అరుణ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. 
 

Similar News