28 ఏళ్ల క్రితం పోయి.. ఇప్పుడు కంట్లో దొరికింది

Update: 2018-08-17 12:18 GMT

28 ఏళ్ల క్రితం పోయి.. ఇప్పుడు కంట్లో దొరికడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయమేంటంటే బ్రిటన్ కు చెందిన 42 ఏళ్ల మహిళ ఇటీవల కంటి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆమె దగ్గరలోని ఓ క్లినిక్ ను సంప్రదించింది. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యులకు ఆమె ఎడమ కంటిలో ఒక లెన్స్‌ ఉన్నట్లు తెలిసింది. అందువల్లే ఆమెకు విపరీతంగా నొప్పి కలుగుతుందని గుర్తించారు. ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌ చేసి లెన్స్‌ను బయటకు తీశారు డాక్టర్లు.. అయితే ఆ లెన్స్ ను పరీక్షించగా అది 28 ఏళ్ల కిందటే ఆ మహిళ కంటిలోకి వెళ్లినట్టు తేల్చారు. ఈ విషయం సదరు మహిళకు చెప్పగా  ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. దాంతో గతంలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది. తనకు 14 ఏళ్ల వయసులో  ఒక రోజు బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా షటిల్‌కాక్‌ నా కళ్లకు తగిలింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే కాంటక్ట్‌ లెన్స్‌ లేదు. షటిల్‌కాక్‌ తగిలినప్పుడే అది ఎక్కడే పడిపోయిందనుకున్నాను. కానీ అది నా కంటి లోపలికి వెళ్లి పోయి ఇన్నాళ్ల పాటు అలానే ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నానని తెలిపింది. 

Similar News