విచిత్రమైన కారణంతో పెళ్లి ఆపేసిన వధువు..

Update: 2018-07-01 05:49 GMT

విచిత్రమైన కారణంతో పెళ్ళితంతు నిలిపివేయించింది ఓ వధువు.ఈ ఘటన బీహార్ లో జరిగింది. సరన్‌ జిల్లా చిట్రసెన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడికి.. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. శుక్రవారం వీరి వివాహం జరగాల్సి ఉంది. పందిట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి, పైగా సర్వం సిద్ధమైన వేళ, హఠాత్తుగా  మేఘాలు అలుముకుని దగ్గర్లో భారీ శబ్దంతో ఓ పిడుగు పడింది. ఆ శబ్ధం విన్న వరుడు అదిరిపడ్డాడు. అంతే వరుడు ఒట్టి పిరికోడు నాకొద్దీ పెళ్లి అంటూ పీటలమీదనుంచి లేచింది.. అంతేకాదు పెళ్లితంతు నిలిపివేయండంటూ పలువురికి ఆదేశాలు జారీచేసింది. దీంతో పెళ్ళికి వచ్చిన బంధువులంతా ఇదేం నిర్వాకం అని నోరెళ్లబెట్టారు. ఆమెకు  సర్ది చెప్పే ప్రయత్నం  చేయగా పెళ్ళికి ససేమీరా 'నో' చెప్పింది. దీంతో చేసేదేమి లేక అర్ధాంతరంగా పెళ్లి తంతు నిలిపివేశారు బంధువులు. కాగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడు తల్లిదండ్రులు. 

Similar News