సెప్టెంబరు 15న తిరుప‌తిలో శ్రీ సీతారాముల కల్యాణం

Update: 2017-09-11 14:18 GMT

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరు 15వ తేదీ శుక్రవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

సెప్టెంబరు 20న ఆలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ:
శ్రీకోదండరామాలయంలో సెప్టెంబరు 20వ తేదీ బుధవారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. హనుమంతుడిని ‘సంకట మోచన’గా పిలుస్తారు. అనగా దుష్టశక్తులను నశింపజేసి చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.
 

Similar News