Current Bill Reduce Tips: కరెంట్‌ బిల్‌ వాచిపోతుందా.. ఈ విధంగా తగ్గించుకోండి..!

Current Bill Reduce Tips: ఎండాకాలం సహజంగానే కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుంది.

Update: 2024-04-23 08:30 GMT

Current Bill Reduce Tips: కరెంట్‌ బిల్‌ వాచిపోతుందా.. ఈ విధంగా తగ్గించుకోండి..!

Current Bill Reduce Tips: ఎండాకాలం సహజంగానే కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుంది. ఎందు కంటే ఉక్కపోత వల్ల 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నడుస్తూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అదనంగా ఇన్‌వేటర్‌ కూడా వాడాల్సిన పరిస్థితులు నెలకొం టాయి. మిగతా సీజన్‌లో సాధారణంగా వచ్చే కరెంట్‌ బిల్‌ సమ్మర్‌ మొత్తం అంతకు రెండింతలు వస్తుంది. ఇలాంటి సమయంలో కరెంట్‌ బిల్లు తగ్గించాలంటే ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఎల్ఈడీ బల్బులు

మీరు ఇంకా పాత ట్యూబ్ లైట్లు, బల్బులు వాడుతున్నట్లైతే వెంటనే వాటిని తీసివేసి బదులుగా ఎల్ఈడీ బల్బులను వాడండి. సాధారణంగా ట్యూబ్ లైట్ 10 గంటలు వెలిగితే 1 యూనిట్ విద్యుత్ ను వినియోగించుకుటుంది. కానీ ఎల్ఈడీ బల్బులు 111 గంటలు వెలిగితే కేవలం 1 యూనిట్ విద్యుత్ ను వినియోగిస్తాయి. వీటిని వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది.

ఏసీలో టైమర్ సెట్ చేయండి

24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీలను ఉపయోగించండి. దీనివల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే ఏసీలో టైమర్ ను సెట్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల కరెంటు బిల్లు పెరగకుండా ఉంటుంది.

ఫ్రిజ్

కొంతమంది ఫ్రిజ్ ను ఖాళీ లేకుండా నింపేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఎక్కువ వస్తువులను ఉంచితే దాన్ని చల్లబరచడానికి ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. కాబట్టి అవసరమైన వస్తువులను మాత్రమే ఫ్రిజ్ లో పెట్టండి. ఇది మీ కరెంట్ బిల్లును తక్కువ చేస్తుంది.

కొత్త పరికరాలు

పాత మోడల్ ఫ్రిజ్ లు, ఏసీలను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. కరెంట్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మాత్రం వీటిని పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఇవి ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అందుకే కొత్త మోడల్ ఫ్రిజ్ లు, ఏసీలను కొనడం ఉత్తమం.

Tags:    

Similar News