Plastic Currency: ఇండియాలో ప్లాస్టిక్‌ కరెన్సీ వస్తుందా.. పేపర్‌ కరెన్సీ కథ ముగిసినట్లేనా..!

Plastic Currency: కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లని రద్దు చేసినప్పటి నుంచి దేశంలో మొత్తం గందరగోళం నెలకొంది.

Update: 2023-05-21 13:30 GMT

Plastic Currency: ఇండియాలో ప్లాస్టిక్‌ కరెన్సీ వస్తుందా.. పేపర్‌ కరెన్సీ కథ ముగిసినట్లేనా..!

Plastic Currency: కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లని రద్దు చేసినప్పటి నుంచి దేశంలో మొత్తం గందరగోళం నెలకొంది. ప్రభుత్వం పేపర్ కరెన్సీని పూర్తిగా నిలిపివేస్తుందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీని స్థానంలో ప్లాస్టిక్‌ కరెన్సీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది. ఇప్పుడు చాలా దేశాలలో ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో ఇండియాలో కూడా ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రభుత్వం రూ.2000 నోట్ల చలామణిని నిలిపివేసింది. ఆర్బీఐ ప్పుడు ఈ నోట్లను వెనక్కి తీసుకుంటుంది. వీటిని సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ పేపర్ నోట్ల సమయం ముగిసింది. ఈ కారణంగా వాటిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ప్లాస్టిక్ కరెన్సీ ప్రపంచంలోని 23 దేశాలలో నడుస్తుంది. ఈ దేశాలు తమ పేపర్ కరెన్సీని ప్లాస్టిక్ కరెన్సీగా మార్చడం ప్రారంభించాయి.

అయితే ఈ 23 దేశాల్లో 6 దేశాలు పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీని అమలు చేస్తున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రూనై, వియత్నాం, రుమానియా, పాపువా న్యూ గినియా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పేపర్ కరెన్సీని కాపీ చేయడం ద్వారా సులువుగా నకిలీ నోట్లను తయారుచేస్తున్నారు. కానీ ప్లాస్టిక్ కరెన్సీని కాపీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అంతేకాకుండా ఈ నోట్లకి తేమ, ధూళి సమస్యలు ఉండవు. పేపర్ నోట్ల కంటే ప్లాస్టిక్ కరెన్సీ ఎక్కువ మన్నికగా ఉంటుంది.

Tags:    

Similar News