Upcoming IPOs Next Week: వచ్చే వారం మార్కెట్లోకి 11 కొత్త ఐపీఓలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర! గుజరాత్ కిడ్నీ హాస్పిటల్ సహా 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు సిద్ధం. పూర్తి షెడ్యూల్ మరియు ధరల వివరాలు ఇక్కడ చూడండి.
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ సందడి కొనసాగుతోంది. గడిచిన వారం కరోనా రెమిడీస్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్ వంటి సంస్థల లిస్టింగ్‌లతో జోరుగా సాగగా, వచ్చే వారం (డిసెంబర్ 22 - 26) ఏకంగా 11 కంపెనీలు ఐపీఓ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో ఒకటి మెయిన్ బోర్డు ఐపీఓ కాగా, మిగిలిన 10 ఎస్‌ఎంఈ (SME) కేటగిరీకి చెందినవి. ఆ వివరాలు మీకోసం..
మెయిన్ బోర్డు ఐపీఓ: గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ
ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెట్‌వర్క్ అయిన 'గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్' వచ్చే వారం పబ్లిక్ ఇష్యూకు రానుంది.
- సబ్‌స్క్రిప్షన్ తేదీలు: డిసెంబర్ 22 నుంచి 24 వరకు.
- ధరల శ్రేణి (Price Band): షేరుకు ₹108 - ₹114.
- నిధుల సేకరణ: సుమారు ₹250.80 కోట్లు.
- విశేషం: ఇది పూర్తిగా తాజా షేర్ల (Fresh Issue) జారీ ద్వారా జరుగుతున్న ప్రక్రియ.
ఎస్‌ఎంఈ (SME) విభాగంలో 10 కంపెనీల సందడి
వచ్చే వారం ఎస్‌ఎంఈ విభాగంలో అత్యధికంగా కంపెనీలు క్యూ కట్టాయి. వాటి షెడ్యూల్ ఇలా ఉంది:
కంపెనీ పేరు,సబ్‌స్క్రిప్షన్ తేదీలు,సమీకరణ లక్ష్యం (కోట్లలో)
ఈపీడబ్ల్యూ ఇండియా,డిసెంబర్ 22 - 24,₹31.81
దాచేపల్లి పబ్లిషర్స్,డిసెంబర్ 22 - 24,₹40.39
శ్యామ్‌ధనీ ఇండస్ట్రీస్,డిసెంబర్ 22 - 24,₹38.49
సన్‌డ్రెక్స్ ఆయిల్,డిసెంబర్ 22 - 24,₹32.25
ధారా రైల్ ప్రాజెక్ట్,డిసెంబర్ 23 - 26,₹50.20
నంతా టెక్,డిసెంబర్ 23 - 26,₹31.81
అడ్మాచ్ సిస్టమ్స్,డిసెంబర్ 23 - 26,₹42.60
భాయ్ కాకాజీ పాలిమర్స్,డిసెంబర్ 23 - 26,₹105.17
అపోలో టెక్నో ఇండస్ట్రీస్,డిసెంబర్ 23 - 26,₹47.96
ఈ టు ఈ ట్రాన్స్‌పోర్టేషన్,డిసెంబర్ 26 - 30,₹84.౨౨
లిస్టింగ్ అప్‌డేట్స్
సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న కంపెనీలు వచ్చే వారం మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి:
- కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ (Mainboard): డిసెంబర్ 22న లిస్టింగ్ కానుంది.
- నెప్ట్యూన్ లాజిటెక్ (SME): డిసెంబర్ 22న లిస్టింగ్.
- మార్క్ టెక్నోక్రాట్స్ & గ్లోబల్ ఓషన్: డిసెంబర్ 24న మార్కెట్లోకి ప్రవేశిస్తాయి.
- ఫైటోకెమ్ రెమిడీస్: డిసెంబర్ 26న లిస్టింగ్ కానుంది.