Petrol and Diesel Price Today: దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు

Petrol and Diesel Price Today: మళ్లీ పెరిగిన చమురు ధరలు

Update: 2021-10-22 04:14 GMT

Representational Image

Petrol and Diesel Price Today: రోజు రోజుకు పెట్రోల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాహనదారులకు మరోసారి షాకింగ్‌ న్యూస్‌ చెప్పాయి ఆయిల్‌ కంపెనీలు. పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసలు పెంచాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీని దాటేసి వేగంగా పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర నూట పదకొండు రూపాయల 18 పైసలకు చేరుకుంది. అలాగే.. లీటర్ డీజిల్ ధర నూట నాలుగు రూపాయల 32 పైసలకు పెరిగింది. ఏపీలోని గుంటూరులో లీటర్ పెట్రోల్ నూట పదమూడు రూపాయలకు చేరుకోనుంది. డీజిల్‌ ధర నూట ఐదు రూపాయల 42 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర నూట పన్నెండు రూపాయల 39 పైసలు, డీజిల్ ధర నూట నాలుగు రూపాయల 89 పైసలకు పెరిగింది.

ప్రముఖ పట్టాణాల్లోనూ పెట్రో ధరలు పరుగులు పెడుతున్నాయి. అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట పద్దెనిమిది రూపాయల 54 పైసలకు చేరుకుంది. డీజిల్ ధర నూట తొమ్మిది రూపాయల 41గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ నూట ఆరు రూపాయల 58 పైసలు, డీజిల్‌ ధర తొంభై ఐదు రూపాయల 62 పైసలకు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర నూట పన్నెండు రూపాయల 78 పైసలు, డీజిల్‌ ధర నూట మూడు రూపాయల 63 పైసలుగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ నూట మూడు రూపాయల 92 పైసలుగాను, డీజిల్ ధర తొంభై తొమ్మిది రూపాయల 92 పైసలకు చేరుకుంది. 


Full View


Tags:    

Similar News