Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా?: ఈ జాగ్రత్తలు మీకోసమే..!
Digital Payments: స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి.
Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా?: ఈ జాగ్రత్తలు మీకోసమే..!
Digital Payments: స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో అవి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేయవచ్చు. డిజిటల్ పేమెంట్స్ చేసిన సమయంలో బ్యాంకులోని డబ్బుల వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసే సమయంలో మనం ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నామో... ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను నిర్ధారించుకోవాలి.లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. కొందరు డబ్బులు చెల్లించినట్టు మేసేజ్ వస్తుంది. కానీ, బ్యాంకులో మాత్రం ఆ డబ్బు జమ కాదు. టెక్నాలజీ సహాయంతో ఇలా మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో ఫ్రీ వైఫైను ఉపయోగించవద్దు. ఇలాంటి వైఫై సహాయంతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలను పొందే అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ లావాదేవీలు నిర్వహించే సమయంలో కూడా ఫ్రీ వైఫై కంటే మొబైల్ డేటాను ఉపయోగించుకోవడం ఉత్తమమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ పేమెంట్స్ చేసే యాప్‌లకు టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఏర్పాటు చేసుకోవాలి. యాప్ లో లాగిన్ కావడానికి ఒక పాస్ వర్డ్, పేమెంట్స్ కోసం మరో పాస్ వర్డ్ ఉపయోగించాలి. అంతేకాదు తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకోవాలి. పాస్ వర్డ్స్ లో అంకెలు, గుర్తులు కూడా ఉండేలా చూసుకోవాలి. బర్త్‌డేలు, పెళ్లి రోజులు గుర్తుండేలా పాస్ వర్డ్స్ ఏర్పాటు చేసుకొంటే అవి సైబర్ చీటర్స్ కు వరంగా మారుతాయి.
డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్, యాపిల్ స్టోర్స్ నుంచి అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాలి. వీటి నుంచి కాకుండా ఆన్ లైన్ లో ఎక్కడి నుంచో ఒక్క చోటు నుంచి డౌన్ లోడ్ చేసుకొనే యాప్స్ తో ఇబ్బందులు వస్తాయి.