Gold Rates: పసిడి ప్రియులకు షాక్..రూ.82వేలకు చేరిన తులం బంగారం ధర

Update: 2025-01-21 23:58 GMT

Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్చత గల బంగారం తులం ధర రూ. 100 పెరిగి రూ. 82,100కు చేరుకుంది. ఆభరణాల తయారీలో వినియోగించే 99.5శాతం స్వచ్చత గల బంగారం ధర తులం రూ. 100 పెరిగి రూ. 81,700కు చేరుకుంది. బుధవారం 99.9శాతం స్వచ్చత గల పసిడి ధర రూ. 82వేలు, 99.5శాతం స్వచ్చత గత గోల్డ్ రేట్ ధర రూ. 81,600 వద్ధ ఉంది. కిలో వెండి ధర రూ. 93,000దగ్గరకొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ. 426 పెరిగి రూ. 78,790లకు చేరింది.

తాజాగా అమెరికాలో ఎలాంటి ఆర్థిక డేటా వెలువడలేదు. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విధానాల నిర్ణయాలపై వ్యాపారులు పెట్టుబడిదారులు ఫోకస్ పెట్టారని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ట్రంప్ విధాన నిర్ణయాలను బట్టే బులియన్ మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొంటాయని వారు చెప్పారు.

Tags:    

Similar News