Sundar Pichai: సుందర్ పిచాయ్ ‘బనానా’ పోస్ట్.. దాని అర్థం ఇదేనా?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ చిన్న పోస్ట్ నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుసగా మూడు అరటిపండ్ల ఎమోజీలను షేర్ చేయగా, ఆ పోస్ట్ కాసేపటిలోనే వైరల్ అయింది
Sundar Pichai: సుందర్ పిచాయ్ ‘బనానా’ పోస్ట్.. దాని అర్థం ఇదేనా?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ చిన్న పోస్ట్ నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుసగా మూడు అరటిపండ్ల ఎమోజీలను షేర్ చేయగా, ఆ పోస్ట్ కాసేపటిలోనే వైరల్ అయింది. దీంతో, ఇది గూగుల్ నుంచి రాబోయే కొత్త ఏఐ టూల్‌కి సంబంధించిన సంకేతమని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.
గూగుల్ ‘నానో బనానా’ టూల్ గురించేనా?
ఎక్స్ఏఐ ప్లాట్‌ఫాం గ్రోక్ ప్రకారం, సుందర్ పిచాయ్ పోస్ట్ చేసిన అరటిపండ్లు గూగుల్ కొత్త ఏఐ టూల్ ‘నానో బనానా’ కు హింట్ కావచ్చని చెబుతోంది. గూగుల్ డీప్‌మైండ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ టూల్ ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ జనరేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశముంది. రియలిస్టిక్ ఫోటోలు నుంచి ఫాంటసీ వరల్డ్ విజువల్స్ వరకు సృష్టించగల సామర్థ్యం దీనికి ఉందని చెబుతున్నారు.
ఏంటి ‘నానో బనానా’?
టెక్స్ట్ ద్వారా ఫోటోలో మార్పులు చేయగలిగే కొత్త జనరేటివ్ ఇమేజ్ టూల్.
కేవలం కొన్ని సెకన్లలోనే ఎడిటింగ్ పూర్తవుతుంది.
ఫేషియల్ డీటెయిల్స్, లైటింగ్, స్టైల్ చెడిపోకుండా మార్పులు చేయవచ్చు.
కొత్త ఫోటో సృష్టించడం, బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, వస్తువులు జోడించడం చాలా సులభం.
ప్రస్తుతం ఇది పబ్లిక్‌కి అందుబాటులో లేకపోయినా, LMArena, Flux AI, Bylo.ai, Dzine వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రయోగాత్మకంగా పరీక్షలు జరుగుతున్నాయి. తొలి వినియోగదారులు దీని ఫోటోరియలిస్టిక్ అవుట్‌పుట్, సీన్ రీకన్‌స్ట్రక్షన్, క్యారెక్టర్ రీస్టోరేషన్ ఫీచర్లను ప్రశంసించారు.
మొత్తానికి, సుందర్ పిచాయ్ బనానా ఎమోజీలు కేవలం సరదా కాదు.. గూగుల్ ఇమేజ్ జనరేషన్ టూల్‌కి పరోక్షంగా ఇచ్చిన క్లూ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.