Stocks to Watch: జూలై 3, గురువారం.. ఇవే ప్రధానంగా గమనించవలసిన స్టాక్స్!
Stocks to Watch on July 3, 2025: జూలై 3 (గురువారం) రోజున మార్కెట్లో చర్చకు రావొచ్చే ముఖ్యమైన స్టాక్స్ ఇవే.
Stocks to Watch: జూలై 3, గురువారం.. ఇవే ప్రధానంగా గమనించవలసిన స్టాక్స్!
Stocks to Watch on July 3, 2025: బుధవారం స్టాక్ మార్కెట్లో స్వల్పంగా క్షీణత కనిపించినప్పటికీ, నిపుణులు మార్కెట్ పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు సూచించేది మాత్రం ఒకటే – అనిశ్చితి ఉన్నా, మంచి అవకాశాలను కలిగించే స్టాక్స్‌ను గమనించాలి. జూలై 3 (గురువారం) రోజున మార్కెట్లో చర్చకు రావొచ్చే ముఖ్యమైన స్టాక్స్ ఇవే:
Nestle India
నెస్లే ఇండియా గుజరాత్‌లోని సనంద్ ఫ్యాక్టరీలో మ్యాగీ నూడుల్స్ తయారీ కోసం కొత్త ఉత్పత్తి లైన్‌ను ప్రారంభించింది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రూ.105 కోట్ల పెట్టుబడితో ఈ లైన్‌ను ఏర్పాటు చేసింది.
Vedanta
వేదాంత ప్రతిపాదించిన సంస్థ విభజనపై పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. ఈ విషయం NCLT ముందుకు వెళ్లింది. జూలై 2న విచారణ జరిగింది.
Indigo Airlines
ఇండిగో ఎయిర్‌లైన్స్ ముంబయి-ఆమ్‌స్టర్‌డామ్ నడుమ నేరుగా విమాన సేవలు ప్రారంభించింది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా మాంచెస్టర్‌కు కూడ ఇటీవలే విమానాలు ప్రారంభించింది.
Patanjali Foods
2006లో విలీనం అయిన రుచి హెల్త్ ఫుడ్స్‌కు సంబంధించిన కేసులో కస్టమ్స్ శాఖ పతంజలి ఫుడ్స్‌కు జరిమానా విధించింది. మొత్తం విలువ రూ.27 లక్షలుగా ఉంది.
Hindustan Zinc
Q1 నవీకరణ ప్రకారం మైండ్ మెటల్ ఉత్పత్తి 1% పెరిగింది. కానీ శుద్ధి చేసిన జింక్, సీసం, వెండి ఉత్పత్తులు వరుసగా 4%, 6%, 11% తగ్గాయి. అమ్మకాలు కూడా 5% తగ్గినట్లు కంపెనీ పేర్కొంది.
Coromandel International
కోరమండల్ ఇంటర్నేషనల్, నాక్ల్ ఇండస్ట్రీస్‌లో 53.13% వాటాను (10.69 కోట్ల షేర్లు) కొనుగోలు చేయడానికి CCI అనుమతి పొందింది.
Indian Bank
ఇండియన్ బ్యాంక్ కొన్ని రకాల రుణాలపై MCLR రేటును 0.05% తక్కువ చేసింది. కొత్త రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. ఇది రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించవచ్చు.
Aurobindo Pharma
HER2 పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన డాజుబ్లైస్ ఔషధం కోసం యూరోపియన్ కమిషన్ అనుబంధ సంస్థ క్యూరా టెక్యూకు ఆమోదం ఇచ్చింది.