Stock Markets: భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు
భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ అంచనాలతో జోష్
స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. రూపాయి కొంతమేర నిలకడగా ఉండటం, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో కీలక సూచీలు ఎగిశాయి. వచ్చే ఏడాదిలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు మార్కెట్ లో జోష్ నింపాయి. పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. మొత్తంమీద సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 206 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 26,172 పాయింట్ల వద్ద క్లోజయింది.