Stock Market: బుల్ జోరు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market Opening Bell: దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
Stock Market: బుల్ జోరు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market Opening Bell: దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్ పరుగులు తీస్తోంది. దీంతో 1900 పాయిట్లకు పైగా సెన్సెక్స్, ఆరు వందల పాయింట్లకు పైగా నిఫ్టీ లాభాల్లో కొనసాగుతుంది. ఒకే రోజు రెండు శాతానికి పైగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.58 గంటల సమయంలో సెన్సెక్స్ 2288 పాయింట్ల లాభంతో 81,742 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 703 పాయింట్లు ఎగబాకి 24,711 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా స్టాక్స్ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.